![]() |
![]() |
.webp)
"ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం" షో ఫస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఈ షోకి నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. ఇక మంచు మనోజ్ నానిని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేసాడు. " నీ రియల్ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు..నువ్వు యాక్టర్ కి కాకుండా డైరెక్టర్ వి ఐతే ఎవరితో మూవీ చేస్తావ్..వాళ్లకు ఎం టైటిల్ పెడతావ్" అంటూ కొన్ని ప్రశ్నలు అడిగేసరికి "నా కొడుకు జున్ను ఆ తర్వాత ఈ ప్రేక్షకులు" అని చెప్పాడు నాని. " ఇప్పుడు వాడికి ఆరున్నరేళ్ల.. మొన్నటి వరకు వాడికి సినిమా అంటే ఏమిటి..నాన్న యాక్టర్ ఆ..ఈ లాజిక్ లన్నీ అర్దమయ్యేవి కావు. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి..ఇప్పుడు వాడికి పియానో అంటే చాలా ఇష్టం. అది నేర్చుకుంటున్నాడు.
పెద్దవాడయ్యాక మ్యూజిక్ చేస్తాడట.. నా సినిమాకు సంగీతం అందిస్తాడట.. సెకండ్ సినిమా ఎవరికీ మ్యూజిక్ చేస్తాడో కూడా చెప్పాడు. కమల్ హాసన్ మూవీకి మ్యూజిక్ చేస్తాడట... నువ్వు నాకు ఫేవరేట్ నాన్న అందుకే నీకు ఫస్ట్ సినిమాకి చేస్తా ..నీ ఫేవరేట్ కమల్ హాసన్ గారు కదా అందుకే ఆయనకు సెకండ్ ఫిలింకి చేస్తా..ఒక వేళా నేను యాక్టర్ కాకపోయి డైరెక్టర్ అయ్యి ఉంటె నేను కమల్ హాసన్ గారితో మూవీ చేసేవాడిని. ఇక టైటిల్ విషయానికి వస్తే ఉస్తాద్ అని పెడతాను..తర్వాత ఈ షోకి నాని ఫ్యాన్ గా పేరు తెచ్చుకున్న శ్రీ ప్రియాని షోకి ఇన్వైట్ చేసి గేమ్ ఆడించాడు మంచు మనోజ్. శ్రీప్రియ స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టి షెల్టర్ ఇస్తుంది. అలాగే నానికి వీరాభిమాని. ఆమె ఏవి ప్లే చేసి చూపించి ఆమెను స్టేజి మీదకు పిలిచాడు. ఇక శ్రీప్రియ కూడా నానికి ఎంతో ఇష్టమైన టమాటో రైస్ చేసి తీసుకొచ్చి మరీ తినిపించింది.
![]() |
![]() |